వేదములే నీ నివాసమట...

తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: దేశాక్షి

వేదములే నీ నివాసమట విమలనారసింహా
నాదప్రియ సకలలోకపతి నమో నమో నరసింహా ॥పల్లవి॥

ఘోరపాతక నిర్హరణా కుటిలదైత్యదమనా
నారాయణ రమాధినాయక నగధర నరసింహా
నీరూపం బింత యంత యని నిజము దెలియరాదు
యీరీతిఁ ద్రివిక్రమాకృతి నేచితి నరసింహా ॥వేదము॥

గోవిందా గుణగుణరహితా కోటిసూర్యతేజా
శ్రీ వల్లభ పురాణపురుషా శితనఖ నరసింహ
దేవ మిము బ్రహ్మాదులకును తెలియ నలవిగాదు
భావించఁగ ప్రహ్లాదు నెదుటఁ బరగితి నరసింహా ॥వేదము॥

దాసపరికరసులభ తపనచంద్రనేత్రా 
వాసవ సురముఖముని సేవిత వందిత నరసింహా
భాసురముగ శ్రీ వేంకట గిరిఁ బాయనిదైవము వటుగానా
వోసర కిపు డేగితి విట్ల నహోబల నరసింహా ॥వేదము॥


అన్నమాచార్యుల కీర్తనల క్రిందనే పెదతిరుమలాచార్యుల కీర్తనలు పాడుకోవటం ఎంతో చక్కనైన పని. తండ్రికి ఏమాత్రం తీసిపోని లక్షణం కలవాడు. సరస్వతీ కటాక్షం తండ్రి నుంచి పుచ్చుకున్నవాడు.

ఎందుకో ఈ కీర్తన జ్ఞప్తికి వచ్చింది ఈరోజు. అర్ధరాత్రి సమయానికి "చంద్రయాన్" మిషన్ లాండింగ్ చూడలేకపోయాను. పొద్దున్నే న్యూస్ చుస్తే బాధ కలిగించింది. ఇంకోపక్క సంతోషం, గర్వం కూడానూ. అంత గొప్పగా మన వైజ్ఞానికులు సాధన చేశారు. విజ్ఞానము అంటే వేదమే. వేదమనే వటవృక్ష మూలమునందు ఉండే దక్షిణామూర్తే ఈ నృసింహ మూర్తి. వేదవేద్యుడు- అంటే వేదాన్ని వేదికగా అధిష్టించినవాడు. గరుత్మంతుడే ఆ వేదిక. అంటే గరుడుడే వేదస్వరూపుడు. ఆ గరుడునిమీద ఆసీనుడైన విష్ణువే వేదవేద్యుడు. గరుడుని ముఖం నాలుగువేదాలకు నెలవు. ఆ వేదనివాసుడు నరసింహస్వామి.

నాదప్రియుడు. నాదం అంటే సంగీతం. సామవేదమే సంగీతానికి మూలం. అంటే, వేద ప్రియుడు నృసింహుడు. రామదాస, అన్నమాచార్య, త్యాగరాజాదులు ఉపాసించిన నాదబ్రహ్మము ఈ నృసింహము. నారసింహుడు పాతకాలను, దుష్టులను తునిమిన వాడు. శంకరఆచార్యుల వారిని కాపాలికుని నుంచి కాపాడినవాడు. గోవర్ధనగిరిని ధరించి, లక్ష్మీనాథుడైనవాడే ఈ నరసింహుడు. విశ్వరూపుడైన వాడి రూపాన్ని ఏమని తెలుసుకోవడం. త్రివిక్రమ రూపం ధరించి సూర్యచంద్రాదులను మించిపోయిన వామనుడే ఈ నృసింహుడు. అట్టి అంతరాళము లోనికి ఒక అంతరిక్ష యానమును తయారు చేసి నడిపినవారు, ప్రహ్లాదాది వేత్తలతో  సామానులు. మోదీగారు నిరుత్సాహం తో ఉన్న వైజ్ఞానికులతో ఒక మాట అన్నారు- "వయం అమృతస్య పుత్రః" అని. చంద్రుడే అమృతాన్ని ఒసగేవాడు. ఆ వెన్నెలల అమృతాన్ని పొంది ఓషధులు, పంటలు వృద్ధి చెందుతాయి. ఆ అమృతపుత్రులము మనము. అట్టి మనం ఎప్పటికీ నిరాశ చెందవద్దని నరేంద్ర మోదీ గారు అన్నారు. ఆ త్రివిక్రమాకృతికి, నటరాజ తాండవానికి మోహితులై ఎంతమంది ఆ విశ్వరూపాన్ని ధ్యానించారో! ఆ విశ్వాన్ని చూసేందుకు మానవ మేధస్సు ప్రయత్నిస్తూనే ఉంటుంది.

గోవిందనామము విష్ణువుయొక్క నామాలలో విశిష్టమైనది. వరాహమూర్తికి గోవిందుడనే నామం వర్తిస్తుంది. అట్టి వరాహనృసింహుడే తిరుమలలో తన క్షేత్రాన్ని శ్రీనివాసునికి ఇచ్చాడు. "గుణగుణరహిత" అనే పదాన్ని వాడాడు కవి. సగుణుడు ఆయనే, గుణరహితుడూ ఆయనే. సగుణ, నిర్గుణ, సగుణ-నిర్గుణాతీతమైన సచ్చిదానంద స్వరూపుడే ఆ నృసింహ పరబ్రహ్మము.

ఆ శ్రీవల్లభుడు వజ్రతుల్యములైన వాడిగోళ్ళను ఆయుధములుగా కలిగినవాడు. కవి చాలా ఉత్తమంగా వాడాడు - "దేవ మిము.. నరసింహా", అని. బ్రహ్మాది దేవతల బుద్ధికి అందనివాడు. అయినా, బాలుడైన ప్రహ్లాదునికి తలచిన వెంటనే దర్శనమిచ్చిన భక్తసులభుడు నరహరి.

తన దాసులకు సహాయపడేవాడు, సులభుడు, సూర్యచంద్రులను నేత్రములుగా కలవాడు ఆ నరసింహమూర్తి. పాదములనుండి నాభి దాకా బ్రహ్మరూపంతో, నాభి నుంచి కంఠం దాకా వైష్ణవ రూపంతో, రుద్రుడే శిరముగా కలిగినవాడు నరసింహస్వామి. అందుకే అయన స్తంభాన్ని ఛేదించి వచ్చాక, సూర్య-చంద్ర-వహ్ని నేత్రాలు కలిగి త్రినేత్రుడిగా భాసిస్తాడు. (ప్రహ్లాదుడు పలికిన నృసింహకవచంలో వచ్చే "వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం...") ఆయన అరుణారుణ కాంతులు కలిగిన జటలతో ఉంటాడు. బహుశా ఆ నేత్రాలు, జటలు చూసి కాపాలికులు శ్రీనివాసుడిని ఆదిభైరవుడిగా కొలిచారేమో! అందుకే నరసింహస్వామి త్రిమూర్తి స్వరూపుడు.

ఇంద్రాది దేవతలు, మునులు స్తుతింపబడే నరసింహుడు, దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ వెంకటాద్రినాథుడై ఉన్నాడు. ఆ ప్రభువే, అహోబల నరసింహుడై వెలుగుతున్నాడు.

పులిహోర

పండుగ అంటే పులిహోర ఉండితీరవలసిందే. చిత్రాన్నమని కూడా అంటారు. ఆహా! ఎవడు కనిపెట్టాడీ వంటకాన్ని! ఆ రుచికి చెవ్వు కోసుకుంటాను. చింతపండుతో, నిమ్మకాయతో, దబ్బకాయతో చెయ్యచ్చు. మామిడికాయతో చేస్తే ఇంకా భేషుగ్గా ఉంటుంది. అన్నం కాకుండా, బియ్యపురవ్వతో, అటుకులతో కూడా చేసుకోవచ్చు. ఇంటో బొత్తిగా ఏమీ లేకపోతే, సద్దన్నం లో ఇంగువ దట్టించి పోపు పెట్టి, ఒక నిమ్మకాయ పిండుకుని తింటే, స్వర్గ సీమలో తేలిపోవచ్చు. తిరుమల గుడిలో దర్శనం చేసుకొచ్చినాక (ఒక్కోసారి) పెట్టే ఒక ముద్ద పులిహోర చాలు, క్యూలైన్ లో నిలుచున్న బడలిక పోవడానికి.

ఇంకో (అన్)పాపులర్ ఉపాయం ఏంటో తెలుసా? ఈరోజు చేసిన చింతపండు పులిహోర, రేపు పొద్దున్న తినటం. దాని దుంపదెగా! ఆ రుచే వేరు! చింతపండు పులిసి, రుచి హెచ్చుతుంది. ఈ ఉపాయం రెండు చోట్ల వర్తించదు. ఒకటి- సద్దన్నం తిననివారికి. రెండు- ఒకవేళ, కొన్ని కారణాల వలన ఆ పులిహోర కనుక పాడవటం జరిగితే. ఈ పులిహోర మజా పొందలేని వారు కూడా ఉన్నారు, ప్రతిదానికీ "నాకు గ్యాసండీ!" అనేవారు. పూర్వజన్మలో ఏ పాపం చేస్తేనో వేస్తాడు భగవంతుడు ఆ శిక్ష. ఒక్క ముద్ద అయినా తిందాం అనుకుంటే, ఒక్కముద్దతో ఆపలేరు. తింటే, పైనుంచి కిందినుంచి ఒకటే అవుట్ గోయింగు. మన జీవితాలు మహా సెడ్డగా అయిపోయినై బాబో! కొత్త మల్లీశ్వరి సినిమాలో ఎంకటేసుబాబు అన్నట్టు, "సరిగ్గా భోంచేస్తే" చచ్చిపోతాము. ఈ మధ్యే మోడీ బాబు అన్నాడు- "జీవిన వ్యవహార మార్పుల వల్ల ఏవైతే జబ్బులొస్తున్నాయో, అవే వ్యవహారాలను కాస్త మార్పు చేస్తే, మన ఆరోగ్యాలను దిద్దుకోవచ్చు", అని.

ఇంకో మాట, పులిహోరను, లెమన్ రైస్ అని అమ్మేవాళ్ళకు నరకం లో నిత్యం అదే తిండి తినే శిక్ష వేస్తాడు యమధర్మరాజు. ఆ దిక్కుమాలిన లెమన్ రైస్ లో తిరగమోత ఉండదూ, 'లెమన్' అంతకంటే ఉండదు. ఇంకో దారుణం కూడానూ; అదేదో "పులియోగరె మిక్స్"ట- రెడీగా పొడి దొరుకుంది. ఆ దానిని అన్నం వండి కలిపితే పులియోగరే అట. నేను కూడా తిన్నాను. ఎదో తేడాగా ఉందేంటా అనుకుంటే తెలిసింది, పొడి కలిపిన పులియోగరె అని.

అన్ని గుళ్ళలో పులిహోర బాగోదు. శ్రీకాళహస్తిలో పులిహోర తిని పొట్ట పట్టుకోవాల్సి వచ్చింది. చింతపండు పులిహోరకి ఒక రహస్యం ఉంది. అదేంటో ఒక అమ్మమ్మగారు చెప్పారు. ఓహో! ఏమి రుచి; ఆ రహస్యమైన దినుసులు కలిపితే! ఇక నిమ్మకాయల ధరలు మాములుగా లేవు. అది చేసుకున్నపూటే ఒక చిన్న పండుగ. దబ్బపళ్ళా పట్నాలలో దొరకటం అరుదైపోయింది. దబ్బపండ్ల రసం పోసి చేస్తే, ఆ పులిహోర ఉంటది నా సామిరంగా!

వేసంకాలంలో, పుల్లటి మామిడికాయలను గుజ్జుచేసి, పులిహోర చేస్తే, మళ్ళీ వేసవి దాకా మిగిలిపోతుంది ఆ రుచి. మామిడికాయ పులిహోరకు వీఐపీ స్టేటస్. ఊరికే దొరికే కాయ కాదాయె. వేడి వేడి పులిహోర రుచి రెట్టింపు అవ్వాలంటే, అప్పుడే దూసిన కరివేపాకులను తుంచి పులిహోరలో కలపాలి. ఆ రెమ్మలను కోస్తుంటేనే సువాసన వ్యాపిస్తుంది. ఇక పులిహోర లో వేస్తే వేరే చెప్పనక్కరలేదు మరి.

ప్రత్యక్షంగా కనబడకుండా అమోఘమైన రుచినిచ్చే ఒక దివ్యమైన పదార్థం ఉన్నది. అదే ఇంగువ. దానిని ఉదారంగా వెయ్యాలంటాడు బాలసుబ్రహ్మణ్యం, మిథునం సినిమాలో. ఇంగువ లేనిదే భోజనానికి రుచేది! పులిహోర లో పెసరపప్పు వెయ్యకండి. మినప పప్పు, శనగపప్పు సరిపడా వెయ్యండి. పల్లీలు బాగా పోసేయ్యకండి. ఆవాలు మరిన్ని వెయ్యండి. ఎండుమిరపకాయలు తుంచి వెయ్యండి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చండి. పసుపు తగినట్టు వెయ్యండి. మరీ పచ్చగా వద్దు. తినేప్పుడు ఎండుమిరపకాయ పారెయ్యకండి. ముద్దతో కొరకండి. ఆ రుచి వేరు!

ధనుర్మాసంలో విష్ణువుకు, దసరాకు అమ్మవారికి, కార్తీక మాసంలో శివుడికి, వినాయక చవితికి గణేశుడికి, సంక్రాంతి పురుషుడికీ, ఇలా అందరు దేవుళ్ళకూ నివేదింపబడుతూ, మన జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్న ఈ పులిహోర తల్లికి దండాలు.

సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట

సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత -
చందమాయఁ జూడరమ్మ చందమామ పంట ॥పల్లవి॥

మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్నుఁగొనచూపులపంట
వినువీధినెగడినవెన్నెలలపంట ॥సందె॥

వలరాజుపంపున వలపువిత్తినపంట
చలువై పున్నమనాఁటి జాజరపంట
కలిమికామినితోడ కారుకమ్మినపంట
మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట ॥సందె॥

విరహులగుండెలకు వెక్కసమైనపంట
పరగ చుక్కలరాసిభాగ్యముపంట
అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట
యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట ॥సందె॥

సంధ్య వేళలో పుట్టాడట, అదేంటి అర్ధరాత్రి కదా? మరి అది కూడా సంధ్యే కదా- తురీయ సంధ్యా సమయం. చాయల పంట అట- కృష్ణుణ్ణి ఇంత ముద్దుగా ఇంకెవ్వడూ వర్ణించలేదే(డే)మో. ఆ అష్టమి నాటి రాత్రి వెలుతురూ ఆయనే, అందుకే చందమామ పంట. వలరాజు అంటే కామదేవుడు, మన్మధుడు. ఆయనే పంపించాడా అనేట్టు కనబడే దివ్యమోహన చైతన్య రూపం, పంటగా వ్యాపించిందట. పున్నమినాటి వెన్నెల ఆకాశంలో పంట ఐతే, ఆ చల్లని పంటే ఆ శ్రీకృష్ణుడు. కలిమినిచ్చే ఆ తల్లితో కలిసి కమ్ముకొచ్చినాడంట, వర్షంతో  నిండిన మేఘమై. మఱ్ఱిచెట్టువలె వ్యాపిస్తాడట మనలో.

అంతేగామరి, "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు" గదా. ఆ వటవృక్షమే మన హృదయ కుహరం. అందులో ఆత్మచైతన్య తత్త్వంలా వెలిగే అఖండ జ్యోతిస్వరూపుడు, గుహ్యతమమైన వాడు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము. విరహంతో వేదన చెందే భాగవతుల గుండెల్లో అసహనమనే పంటగా వ్యాపించాడట. ఒప్పుగా ఉన్న నక్షత్రాలకు భాగ్యాంగా దొరికిన చంద్రుడట. అంటే, ఎందరో భాగవతులకు ఆ భాగ్యము పండితే తప్ప దొరకని పంట, ఆ శ్రీకృష్ణ ప్రభువు. అపూర్వంగా, ఉదయాద్రి ఐన గరుడాద్రి పైన ఆరబోసినట్టు ఉన్న పంట అట. ఇరవు అంటే స్థిరము. ఎప్పటికీ ఉండిపోయే ఆ శ్రీవేంకటేశ్వరుడే మన ఇంటి లోని పంట, అంటున్నాడు అన్నమయ్య. ఆ కృష్ణుడే ఈ వేంకటకృష్ణుడు.

అన్నమయ్య, పంట అనే పదాన్ని ఎందుకు ఇంత వాడాడో! మరి ఊరికే పండదుగా. ఎడ్లను జోడించినప్పటి నుంచి కుప్పలెత్తే దాకా, రైతు కష్టపడనిదే రానిదాయె. పరబ్రహ్మము నందు ఆసక్తి ఏర్పడి, శ్రమించి, నవవిధ భక్తి విధానాలతో కొలిస్తే తప్ప అవగతమవదు పరబ్రహ్మ తత్త్వం. పంట అని తేలికగా అన్నాడు, వాడు అన్నమయ్య కాబట్టి. ఎన్ని కష్టాలు పడితే పుట్టాడు దేవకి-వసుదేవులకు. వారి నోములు, దండాలు పండినై ఎనిమిదో గర్భానికి. ముందే పాలవెల్లి పుట్టి తాను పుట్టాడట. పాలవెల్లి అంటే, భగవంతుణ్ణి ఏర్పాటు చేసుకునే స్థానం. ఆ కృష్ణదేవుడు వస్తున్నాడని చోటు ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకే చోటా? త్రివిక్రముడు కాదా మరి? అంత స్థలమంటే ఏమై ఉంటుంది? అదే ఆయనకన్న ముందు పుట్టిన యోగమాయ. సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి. ఆవిడే పాలవెల్లి, అన్నిటికీ నిధి ఐన పాలసముద్రం. ఈ పంటల, వెన్నెలల  వర్ణన తెలుగు వారికేనేమో! వేయిపడగలు నవలలో, విశ్వనాథ వారు మహాద్భుతంగా వర్ణిస్తారు. ఎంతైనా పూర్వీకుడైన అన్నమయ్య పెట్టిన భిక్షేగా! చంద్రుడు సస్యములను పోషించే వాడు. తన వెన్నెల ద్వారా అమృత ధారలను కురిపిస్తాడు. పంటలలో ఆ అమృతత్వం నిండి, అవి మనం తినడం వలన ఆ అమృత గుణం మనలో చేరుతుంది. అంటే, చంద్రుని రూపంలో ఆ శ్రీనివాసుడు మనకు పోషణను ఇస్తున్నాడు.

ఈ కృషుడు అమరావతికే వెలుగు అంటున్నాడు అన్నమయ్య. ఆ వాసుదేవుడు పుట్టగానే, దేవతలు సంతోషంతో పొంగిపోయారు. అప్పటిదాకా కష్టాల చీకటిలో ఉన్నవారికి, ఒక్కసారిగా ఆ కృష్ణుని జన్మంతో వెలుతురు కనిపించింది.

ఇంతటి గొప్ప భావాన్ని, ఈ చిన్ని పాటలో అందించిన ఆ అన్నమాచార్యునికి ఎన్నో దండాలు. విత్తనం లోనే చెట్టు దాగి ఉన్నట్టు, చిన్న పాటలో భాగవతాన్ని అందించాడు పదకవితా పితామహుడు.

ది ఫ్యూజిటివ్ (పలాయితుడు)

నేను చుసిన కొన్ని గొప్ప ఉత్కంఠభరిత చిత్రాలలో ఇది ఒకటి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చూడాలనిపించి చూశాను. ఎందుకో ఈ సినిమా గురించి తెలుగు లో వ్రాద్దాము అనిపించింది. హారిసన్ ఫోర్డ్ ని నేను మొట్టమొదలు చూసింది ఇండియానా జోన్స్ చిత్రాలలో. ఫ్యూజిటివ్ అంటే తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకు తిరిగే వ్యక్తి. ఎందుకు హారిసన్ ఫోర్డ్ పరారీ లో ఉన్నాడనే విషయంలోకి నేరుగా ప్రవేశింపజేస్తాడు నిర్దేశకుడు. ఫోర్డ్ ఈ చిత్రంలో ఒక ఊపిరితిత్తుల వైద్యుడు(డాక్టర్ రిచర్డ్ కింబుల్). తన భార్యను దారుణంగా చంపేస్తాడు ఒకడు. ఆ హంతకుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో విఫలం అవుతాడు. భటులు వచ్చి ఈ డాక్టర్ని తీసుకెళ్ళిపోతారు. ఇతడే హంతకుడు అని విచారణలో తేల్చి కోర్ట్ వారు మరణదండన విధిస్తారు. చెఱసాలకు తీసుకుపోయే దారిలో రిచర్డ్ తప్పించుకుంటాడు. ఆ తరువాత, అతన్ని పట్టుకునేందుకు డిప్యూటీ మార్షల్ శామ్యూల్ జెరార్డ్ తీవ్రమైన కృషి చేస్తాడు. ఇంతకీ డాక్టర్ ని పట్టుకోవటం లో శామ్ సఫలం అవుతాడా అనేది సినిమా.
Image result for the fugitive
పలాయితుడు

యూఎస్ మార్షల్ సర్వీస్ అనేది యూఎస్సే న్యాయ విభాగం కింద పనిచేస్తుంది. అందుకని, తప్పించుకున్న నేరగాళ్ళను పట్టే పని మార్షల్స్ తీసుకుంటారు. పోలీస్ వారు సన్నగా కేసు మూసేసేట్టు ఉన్నారని పసిగట్టి, శామ్ ఇంకా తీవ్రంగా కేసుని చేపడతాడు. ఆద్యంతం రోమాంచితంగా సాగే ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా వృధాగా ఉండదు. ఈ చిత్రానికి సంగీతం కూడా కుతూహలం పెంచేట్టు తోడ్పడింది. తప్పుచెయ్యనివాడు ముద్దాయి అవుతాడు. వాడిని పట్టుకునేందుకు శామ్ కష్టపడుతూ ఉంటాడు. ఒకపక్క డాక్టర్ దొరకకూడదు అని మనం అనుకుంటుంటే ఇంకోపక్క మార్షల్ శామ్ అసలు ఎటువంటి జాలి, ద్వేషం లేకుండా వెంటాడుతూ ఉంటాడు. తనకు ఎక్కడా సహాయం దొరకదు అని అర్దమైనాక, డాక్టర్ కింబుల్ తనకు తానే పరిశోధన మొదలుపెడతాడు.

బాగా నచ్చిన అంశం ఏంటంటే, డిప్యూటీ మార్షల్ శామ్యూల్ పాత్ర. ఇలాంటి అధికారులు మన సమాజానికి ఎంతో అవసరం అనిపిస్తుంది. చిత్రంలో ఇంకో అంశం ఏంటంటే, రక్షణ వ్యవస్థలో ఇబ్బందులు, వివిధ రక్షణ సంస్థల మధ్య జరిగే పోట్లాటలు మనకు అర్ధం అవుతాయి. కథ చెప్పేందుకు నిర్దేశకుడు నగర ప్రాంతాన్ని, భౌగోళిక లక్షణాలను బాగా వాడుకున్నాడు.

డాక్టర్ కింబుల్ తన పేరుమీద ఉన్న మురికిని ఎలా తొలగిస్తాడు ? తన భార్యను ఎందుకు, ఎవరు చంపారు ? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి పొందవలసిందే! హారిసన్ ఫోర్డ్ జీవితంలోనే గొప్పగా మిగిలిపోయే చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమాను తెలుగులో కాపీ కొట్టడం కూడా జరిగిపోయింది. నాగార్జున నటించిన "క్రిమినల్" సినిమా అది. కాపీ కొట్టినా బాగా తీయలేరేంటో మనవాళ్ళు. ఛ!

Another loss for Team India

It is just another loss for India. Nothing more. The world cup for us, is done and dusted. It was painful to see India lose to Australia in the finals of 2003 WC. Then it was more painful watching India in 2007. Although India had a good outing in 2015, they crumbled in the semifinal against Australia.

2019 World Cup campaign began with pundits picking the Kiwis and the English as title favorites. India started winning games one by one. England showed overall ability in beating India. Rain spoiled India's chances of having a go at New Zealand in the league stage.

2015 was the series India went in with most players having less ODI experience. Dhawan, Rohit Sharma, and Kohli handled the top order. Middle order boasted of Rahane, Raina, and Dhoni. Bhuvaneshwar, Shami, and Ashwin led the bowling attack. All through the group stage, India played well. The bowlers especially, did outstandingly well. However, when India faced Australia in the semi final, the bowling attack was ripped apart. Once the batsmen get the better out of the bowlers in the beginning, the latter lose the mental fortitude and begin to give up. This scenario happened in the 2003 World Cup final match, where Indian bowlers succumbed to the batting prowess of the Aussies. 2015 was a repeat of 2003. Rohit Sharma, Dhawan and Kohli were the big names. Once they were out of the game, rest of the batsmen failed to step up and India came home.

2019 is a reminder of the previous world cup. India had a fairly good outing. But, this time, there is no experience in batting and bowling departments. India's pace was headed by Bumrah. Bhuvaneshwar and Shami played second fiddles. Kuldeep and Chahal led the spin attack, but both have failed to grab interest. India had two all rounders in Pandya and Jadeja, but they benched Jadeja for Kuldeep. Shikhar Dhawan unfortunately had to leave. This meant that the youngsters like Rahul and Dinesh Karthik, had to up their game. India did not have an experienced side this time. It is not the skill, but the consistency and the number of games played, makes one a good player. Having benched Jadeja and rotating Bhuvi and Shami, India kept experience out of the playing XI. Bowling and batting departments filled each other's voids. The matches with Afghanistan, Bangladesh, and England exposed India's flaws. Yet, they did not learn from their mistakes. Rohit and Kohli were the walls behind which India's weak batting order hid. Dhoni failed to impress with the bat, yet fans stood by him. Major disappointment was the failure of KL Rahul. He came in with shoes to fill. There is no point when you fail to stand up in case of a crumble. Jadhav and Vijay Shankar were mere fillers in the playing eleven. They managed to get into the squad, but they did not do well enough to let the captain not drop them.

The middle order was basically newbies, except for Dhoni. India trusted D K, but the lack of experience showed. India should have a fixed squad and play continuously with it. Also, I blame the T20 atmosphere. The middle order cannot go on a hitting spree and then get out on a loose shot, as they do in T20. India also lacks an orthodox spinner who can genuinely bowl spin, without going into varieties. If India thinks players like DK and Rahul merit selection, they should give them more games and shape them into better players.

2019 World Cup was literally a damp squib. World Cup gains its viewership from the subcontinent. It is annoying when they schedule India's games too late into the series. The fever does not begin until India begins playing. Well, sometimes luck should favour you. Remember how a well experienced Croatia lost to a young French team in the Football World Cup final ? Things like that happen.

Here's to more victories and entertainment.